25 May, 2026 | 10:47 PM

కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యత.

25-05-2026 09:50 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని జగన్నాధపురం సర్పంచ్ కుంజా వినోద్ తెలిపారు. ములకలపల్లి మండలం జగన్నాధపురం పంచాయతీలో మంజూరైన స్వయం సహాయక సంఘాల భవనాలకు ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రభుత్వ పథకాల్లో మహిళలకు సముచిత స్థానాన్ని కల్పిస్తుందని చెప్పారు.స్వయం సహాయక సంఘాలతో ఆర్థిక అభివృద్ధి సాధించి సమాజంలో నిలబడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామ సమైక్య సంఘాలకు పక్క భవనాలను మంజూరు చేశారన్నారు.జగన్నాధపురం గ్రామపంచాయతీలో ఐదు భవనాలు అవసరం ఉందని మొదటి విడతలో భాగంగా మూడు భవనాలు మంజూరు  అయ్యాయని తెలిపారు. రాజాపురం గ్రామంలో భవనానికి స్థలం ఇచ్చిన స్థలదాత సున్నం చినరాజు కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు.