ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ లో బేబీ ఫీడింగ్ రూమ్ ఏర్పాటు చేయాలి
25-05-2026 09:40 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ లో బేబీ ఫీడింగ్ రూమ్ ఏర్పాటు చేయాలని యంగ్ స్టార్ యూత్ అధ్యక్షులు షేక్ షకీల్ కలెక్టర్కు విన్నపం చేశారు. సోమవారం నిర్మల్ లో ఈ వినతి పత్రం ఆయన కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. ఖానాపూర్ బస్టాండు నుంచి మంచిర్యాల ,నిర్మల్ ,నిజామాబాద్, కరీంనగర్ ,వైపు నిత్యం వేలాది మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారని, దాంట్లో గర్భిణీ, బాలింతలకు, ఇబ్బందులు కలగకుండా బేబీ ఫీడింగ్ రూమ్ ఏర్పాటు చేసి సదుపాయం కల్పించాలని కోరారు.






