12 August, 2026 | 2:40 AM

గ్రామాల అభివృద్ధికి పటిష్ట ప్రణాళికలు

12-08-2026 12:03 AM

అదనపు కలెక్టర్ కిరణ్మయి

రంగారెడ్డి, ఆగస్టు 11(విజయక్రాంతి): గ్రామాల సమగ్ర అభివృద్ధి అన్ని శాఖల సమన్వయంతోనే సాధ్యమవుతుందని జిల్లా అదనపు కలెక్టర్ కె. కిరణ్మయి తెలిపారు. మంగళవారం ఐడీఓసీలో నిర్వహించిన అధికారుల సమావేశంలో పారిశుధ్యం, నీటి సంరక్షణ, అభివృద్ధి ప్రణాళికలపై పలు విషయాలపై సమీక్ష చేశారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు మంజూరైనా నిధులు, వనరులను సమర్థవంతంగా అనుసంధానించి ప్రజలకు గరిష్ట ప్రయోజనం అందించాలన్నారు.

ప్రతి గ్రామానికి చెం దిన పూర్తి మౌలిక వసతులు, అవసరాలతో సమగ్ర బుక్లెట్ రూపొందించాలి, గ్రామసభ ల ద్వారా ప్రాధాన్యతలను గుర్తించి, ప్రణాళికలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలు చేయాలి, ఫార్మ్ పాం డ్స్, సోక్ పిట్ల నిర్మాణంతో వర్షపు నీటిని సంరక్షించాలని చెప్పారు. వనమహోత్సవం లో నాటిన ప్రతి మొక్కకూ నీరుపోస్తూ పర్యవేక్షించాలని.. సీజనల్ వ్యాధులు వ్యాపించ కుండా పరిశుభ్రత చేపట్టేలా అవగాహన క ల్పించాలని సూచించారు. సమావేశంలో జ డ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డీపీవో సురేష్ మోహన్, డీఎంహెచ్‌వో స్వర్ణకుమారి, అధికారులు పాల్గొన్నారు.