మంచినీటి పైప్‌లైన్ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ
28-07-2026 12:10 AM
కరీంనగర్, జూలై 27 (విజయక్రాంతి): నగరంలోని 19వ డివిజన్ లో కరీంనగర్ నగర పాలక సంస్థ 15వ ఆర్థిక సంఘం నిధులు 20 లక్షలతో మంచినీటి పైప్ లైన్ పనులకు మాజీ మంత్రి, కరీంనగర్ శాసన సభ్యులు గంగుల కమలాకర్ సోమవారం భూమి పూజ చేశారు.
పనులు త్వరితగతిన నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కార్పోరేటర్లు సుధగోని మాధవి-కృష్ణ గౌడ్, పర్వతం మల్లేషం, గుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్, మాజీ కార్పోరేటర్ తుల బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.






