పోలీస్ పాత్ర లేని థ్రిల్లర్ మూవీ!
త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, తన్వీ నేగి, సహర్ కృష్ణన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘అదే నీవు అదే నేను’. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై గోవిందు కాండ్రేగుల నిర్మిస్తున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో యువ దర్శకుడు కొండల్ రూపొందిస్తున్నారు. కల్పలత, సునయన, బిత్తిరి సత్తి, మీర్, సూర్యతేజ, నరేందర్, రమణ భార్గవ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ఈ నెల 31న థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.
తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను పాన్ ఇండియా యాక్టర్ సునీల్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ.. “అదే నీవు అదే నేను’ ట్రైలర్‌లో షాకింగ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆకట్టుకు న్నాయి. ఈ సినిమా తప్పకుండా థియేటర్లలో చూడం డి. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయండి” అన్నారు. చిత్ర దర్శకుడు కొండల్ మాట్లాడుతూ.. “మా సినిమా థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కించినా ఒక్క పోలీస్ క్యారెక్టర్ లేకపోవడం విశేషం” అని తెలిపారు. ఈ చిత్రానికి డీవోపీ: నిమ్మల జయపాల్ రెడ్డి; సంగీతం: కనిష్క; ఎడిటర్: ఛోటా కే ప్రసాద్; ఆర్ట్: నార్ని శ్రీనివాస్.






