29 April, 2026 | 10:16 PM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శ

29-04-2026 08:22 PM

మృతుని కుటుంబానికి రూ. 10,000 ఆర్ధిక సాయం

ధర్మపురి,(విజయక్రాంతి): వెల్గటూర్ మండలం రాజక్కపల్లి గ్రామంలో ఇటీవల విద్యుత్ ఘాతంతో దుర్మరణం చెందిన కుశనపెల్లి శ్రీనివాస్ కుటుంబాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుని కుటుంబానికి రూ. 10,000 అందించి ఆర్థికభరోసా కల్పించారు. మృతుని కుటుంబానికి అన్నీ విధాలుగా ఆదుకుంటూ అందుబాటులో ఉంటామనీ హామీ ఇచ్చారు. అధైర్య పడకుండా శ్రీనివాస్ జ్ఞాపకాలతో ముందుకు సాగాలనీ కుటుంబానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మనోధైర్యం కల్పించారు. ఆయన వెంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పత్తిపాక వెంకటేష్,బీఆరెఎస్ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శిలు చల్లూరి రాంచందర్ గౌడ్,జూపాక కుమార్, సీనియర్ నాయకులు మూగల సత్యం, పెద్దూరి భరత్ కుమార్,గాజుల సుమన్,దోరిశెట్టి మల్లేశం తదితరులు ఉన్నారు.