15 June, 2026 | 11:40 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

బడి పిల్లల కోసం బోర్ వేపించిన ఎమ్మెల్యే పాయం

12-06-2026 05:53 PM

గుండాల,(విజయక్రాంతి): మండల పరిధిలోని సాయనపల్లి గ్రామపంచాయతీలో గల ఘణాపురం గ్రామంలో పాఠశాల నందు బోర్ మరమ్మతులకు గురి కావడంతో రెండు సంవత్సరాల నుండి విద్యార్థులకు మంచి నీటి కొరత ఏర్పడి చాలా ఇబ్బందులకు గురి కావడం జరిగింది. ఈ విషయాన్నీ సాయనపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ కల్తి కృష్ణవేణి నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లకు తెలపడంతో వెంటనే స్పందించి శుక్రవారం బోర్ వెల్ సహాయంతో బోర్ వేపించడం జరిగింది.

దీంతో ఆ పాఠశాలకు సమబంధించిన విద్యార్థులు ఆనందంతో పాయం వెంకటేశ్వర్లకు ధన్యవాదములు తెలపడం జరిగింది. వారే కాకుండా ఆ గ్రామ పెద్దలు మహిళలు కూడా పిల్లల కోసం అడిగిన వెంటనే బోర్ వేపించిన శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కల్తి కృష్ణవేణి, అరెం బసవయ్య, ఇర్ప కన్నయ్య, జగ్గారావు, కల్తి రాంబాబు, చంద్రయ్య, బిక్షపతి గ్రామ ప్రజలు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.