26 July, 2026 | 6:33 PM

కుటుంబాలకు అండగా ఉంటాం

26-07-2026 05:46 PM

కుబీర్,(విజయక్రాంతి): కుభీర్ మండలంలోని సిరిపెల్లి తండా-3, పార్డి-కే, హంపోలి గ్రామాలతో పాటు భోకర్ తాలూకాలోని కీని గ్రామంలో డా.ముత్యం రెడ్డి తండ్రి ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాలను ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్  పరామర్శించారు. ఈ సందర్భంగా మృతి చెందిన వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు.