26 July, 2026 | 6:55 PM

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల పోరాటానికి దక్కిన విజయం

26-07-2026 05:49 PM

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు 

జిల్లా కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థుల ఉద్యమానికి, ప్రజాస్వామ్యానికి దక్కిన విజయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు.

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ, నీట్ పేపర్ లీకేజీతో దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనకు గురయ్యారని, ప్రజల ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం చివరకు స్పందించాల్సి వచ్చిందన్నారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విద్యార్థుల పక్షాన ఈ అంశాన్ని బలంగా లేవనెత్తినట్లు తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ మాట్లాడుతూ, ఇది యువత ఐక్యతకు నిదర్శనమని, విద్యార్థుల హక్కుల పరిరక్షణలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు.