డిప్యూటీ మేయర్ ను సత్కరించిన పద్మనాయక వెలమ సంఘం
ముకరంపుర,(విజయక్రాంతి): పద్మనాయక కళ్యాణ మండపంలో జరిగిన పద్మనాయక వెలమ సంఘం సర్వసభ్య సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావును ఆదివారం సత్కరించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గా ఎన్నికైనందుకు పద్మనాయక వెలమ సంఘం అధ్యక్షుడు హనుమంతరావు ఆధ్వర్యంలో యాదగిరి సునీల్ రావును సత్కరించారు.
ఈ సందర్భంగా పద్మనాయక వెలమ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ... ప్రజా సేవలో సునీల్ రావు మున్ముందు మరెన్నో ఉన్నత విజయాలు సాధించి,ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాల ప్రజలకు నిరంతరం సేవ చేస్తూనే, వెలమ సామాజిక వర్గ అభివృద్ధి కోసం మరియు వారి సంక్షేమం కోసం కూడా ఆయన ప్రత్యేకంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర తొలి వెలమ కార్పొరేషన్ ఛైర్మెన్ జువ్వాడి నర్సింగరావు, కరీంనగర్ డెయిరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్ రావు, కరీంనగర్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నమనేని సుధాకర్ రావు, కరీంనగర్ జిల్లా పద్మనాయక వెలమ సంఘం సభ్యులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.






