ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠాపనలో ఎమ్మెల్యే పాయం
28-02-2026 01:01 AM
బూర్గంపాడు, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ గంగాపార్వతి సమేత అగస్త్యేశ్వరస్వామి దేవాలయంలో నూతనంగా ఏర్పాటుచేసిన ధ్వజస్తంభ పునఃప్రతిష్ట, బలిపీఠ ప్రతిష్ట మరియు లక్ష్మీ గణపతి, బాలత్రిపుర సుందరి దేవతల ప్రతిష్ట మహోత్సవంలో శుక్రవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ సర్వేశ్వరుని ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి, స్థానిక సర్పంచ్ మందా నాగరాజు, ఉప సర్పంచ్ గుండె వెంకన్న, టీపీసీసీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ భజన సతీష్, సారపాక సర్పంచ్ కిషోర్ నాయక్, భజన ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




