20 July, 2026 | 6:44 PM

Breaking News

నాగలి పట్టిన ఎమ్మెల్యే పాల్వాయి

20-07-2026 01:07 AM

బెజ్జూర్ జూలై 19 (విజయ క్రాంతి) కాగజ్ నగర్ మండలం లోని అంకుసాపూర్ పంట చేనులో సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు నాగలి పట్టారు. సర్వే నం.145 లో దాదాపు 30 మంది రైతులకు ప్రభుత్వం గతంలోనే లావుని పట్టాలు ఇచ్చిందని,దశాబ్దాలకు పైగా సాగు చేసుకుంటున్న ఈ భూములపై ఫారెస్ట్ అధికారుల కన్ను పడ్డదని, ఈ భూమి మాదేనని రైతుల సాగును అడ్డుకోవడం జరుగుతోందన్న  విషయం తెలుసుకున్న సిర్పూర్ శాసనస భ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు రైతులకు సంఘీభావంగా సర్వే నెం.145 లోని భూమిని దున్ని పత్తి విత్తనాలు వేయడం జరిగిందని అన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయని, పట్టాలున్న రైతులను కూడా సాగు చేయకుండా అడ్డుకుంటున్నారని, ఇది అన్యాయమని తెలియజేశారు. గత ప్రభుత్వం ఇదే విధంగా రైతులను ఇబ్బంది పెట్టిందని, ఈ ప్రభుత్వం కూడా అంతే దౌర్జన్యంగా వ్యవహరిస్తుందని తెలిపారు. అంకుసాపూర్ లో పట్టాలున్న రైతుల జోలికి వెళ్ళవద్దని ఫారెస్ట్ అధికారులకు హితవు పలికారు.  లేని పక్షంలో రైతుల హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు మానేపల్లి సత్తయ్య, గౌత్రే హనుమంతు, డోంగ్రే కార్తీక్, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.