6 May, 2026 | 7:54 PM

Breaking News

జిల్లా కోర్టును సందర్శించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పులి సులోచనరావుకు అభినందనల వెల్లువ   •   పెళ్లి రోజు సందర్భంగా ఎల్లమ్మ, మహంకాళి అమ్మవార్లను దర్శించిన తలసాని దంపతులు   •   జవహర్ నగర్‌లో గృహిణి అదృశ్యం   •   గిరిజన ప్రాంతాలలో అమలు చేస్తున్న కార్యక్రమాల లక్ష్యాలను సాధించాలి   •   శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవానికి ఆహ్వానం అందజేత   •   వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన సదస్సు   •   ఆర్టీసీ సూపర్వైజర్ కాలనీలో ఘనంగా అభయ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన   •   నాగోల్‌లో స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనుల వేగం పెంచాలి   •   పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి - సిపిఐ   •  

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి

10-10-2025 06:06 PM

కోదాడ: కోదాడలో కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఆళ్ళ భాగ్య రాజ్ చిత్ర పటానికి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి శుక్రవారం పూల మాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు. చిలుకూరులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొడారు లక్ష్మీనారాయణ రావు ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిలుకూరులో స్వర్గీయ దొడ్డా సురేష్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. చిలుకూరులో గంగి రెడ్డి నర్సి రెడ్డి తల్లి స్వర్గీయ గంగి రెడ్డి ఈశ్వరమ్మ కుటుంబాన్ని పరామర్శించారు.

నడిగూడెం మండలం, రత్నవరం లో స్వర్గీయ రామిని రవీందర్ రెడ్డి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రత్న వరంలో రామిని కృష్ణా రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. నడిగూడెం మండలం, బృందావన పురం లో మాజీ సర్పంచ్ స్వర్గీయ మండవ అంతయ్య చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.