6 May, 2026 | 8:41 PM

Breaking News

లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •   ఉమామహేశ్వరంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు   •  

ప్రతి విద్యార్థి శాస్త్రీయ సాంకేతిక రంగాలలో ముందుండాలి

10-10-2025 06:09 PM

పెన్ పహాడ్: ప్రతి విద్యార్థి శాస్త్రీయ - సాంకేతిక  రంగాల్లో ముందుండాలని అంతరిక్ష పరిశోధన విభాగలపై మరింత ఆసక్తి పెంపొందించుకొని భవిష్యత్తులో రాణించాలని ఇస్ట్రాక్ సెంటర్ సీనియర్ సైంటిస్ట్ సీహెచ్ వెంకటరమణ విద్యార్థులకు సూచించారు. శుక్రవారం మండలంలోని అనాజిపురం ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన అంతరిక్ష వారోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు భవిష్యత్తు ప్రణాళికలపై పలు సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా ఉపగ్రహాల ప్రయోగ విధానం, రాకెట్ సాంకేతికత, భారత అంతరిక్ష పరిశోధనలో సాధించిన విజయాలు వంటి అంశాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులలో దాగివున్న సందేహాలను ఆయన నివృత్తి చేశారు.