15 May, 2026 | 8:18 PM

Breaking News

సెలవులకు ఇంటికి వచ్చిన విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలి   •   బాన్సువాడలో నూతన ఆర్డీఓ క్యాంప్ కార్యాలయం ప్రారంభం   •   పరీక్ష కేంద్రం వద్ద చల్లటి నీరు, అంబలి పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ బొడ్డు స్పందన గంగన్న   •   జవహర్ నవోదయ పాఠశాలకు భూమి స్వాధీనం.. రైతులతో చర్చించి సరిహద్దుల ఖరారు   •   ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి   •   మలిదశ ఉద్యమకారుల ముందస్తు అరెస్ట్   •   ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం   •   ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చడం సిగ్గుచేటు   •   దొంగలు... బాబోయ్... దొంగలు...   •   చెంచుల జీవనోపాధికి టీజీఐఎల్పీ కీలకం   •  

ఇరుముడి మహోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే మేఘారెడ్డి

01-12-2025 12:25 AM

పెద్దమందడి, నవంబర్ 30 : హనుమాన్ మాల ధరించి మండల కాలం 41 రోజు దీక్షను పూర్తి చేసి ఆదివారం పెద్దమందడి మండలం మనిగిళ్ళ గ్రామ చౌదర్పల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన ఇరుముడి కార్యక్రమానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఇరుముడి మహోత్సవ సందర్భంగా భక్తులకు అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేసిన  మాజీ జెడ్పిటిసి రమేష్ గౌడ్ దంపతులను ఆయన అభినందించారు.

మనిషి ఇలాంటి దీక్షలు తీసుకోవడం ద్వారా ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా బాగుంటారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆంజనేయ స్వాములు అయ్యప్ప స్వాములతో కలిసి పూజలు చేశారు. అనంతరం మేఘారెడ్డి మాట్లాడుతూ చౌదరిపల్లి ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి తాను ఎల్లవేళలా సహకరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి వెంకటస్వామి, సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సత్యారెడ్డి, మాజీ సర్పంచులు వెంకటస్వామి, శ్రీనివాస్ రెడ్డి నాయకులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.