13 March, 2026 | 10:17 PM

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

13-03-2026 08:45 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ దిలావర్పూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనులు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. లోలం ముజ్గి చిట్యాల అక్కపూర్ గ్రామాల్లో సిసిరోలు, ఐకెపి భవనాలు పాఠశాల ప్రహరీ గోడలు, ఉపాధి హామీ పనులు తదితర పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ శ్రీనివాస్ ఆయా గ్రామాల సర్పంచ్లు నాయకులు పాల్గొన్నారు.