రైతుల డిజిటల్ నమోదు వేగవంతం చేయాలి
19-05-2026 01:57 PM
కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్.
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా పసుపుల గ్రామంలో రైతుల యూఎఫ్‌ఐడీ నమోదు ప్రక్రియను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ పరిశీలించారు. రైతుల వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని, ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అందేందుకు యూఎఫ్‌ఐడీ కీలకమని తెలిపారు. జిల్లాలో మొత్తం 3,21,045 మంది రైతులు ఉండగా, ఇప్పటివరకు 2,18,890 మంది రైతుల వివరాలు నమోదు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇంకా 1,20,155 మంది రైతుల నమోదు పూర్తి చేయాల్సి ఉండగా 68.9 శాతం రైతుల నమోదు పూర్తైనట్లు వెల్లడించారు.






