21 May, 2026 | 3:49 AM

కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి

21-05-2026 01:29 AM

చేగుంట, మే 20: చేగుంట మండలం బోనాల కొండాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రం ను సర్పంచ్ రంగయ్యా గారి రాజిరెడ్డి తో కలిసి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సందర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాలలో లారీల కొరత తీవ్రంగా ఉందని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా అధికారులతో మాట్లాడి లారీలను సమకూరుస్తానని ఎమ్మెల్యే రైతులకు హామీ ఇచ్చారు. వెంటనే అధికారులతో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి తక్షణమే లారీలను ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు పడకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.