ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..
కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య
టేకులపల్లి, (విజయక్రాంతి): రాష్ట ప్రభుత్వం ఆర్ధికంగా లోటులో ఉన్నా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందనీ ఎమ్మెల్యే కనకయ్య(MLA Koram Kanakaiah) అన్నారు. సంక్షేమ పధకాలు అమలుతో పాటు, అన్ని రంగాల పురోగతి దిశగా పయనిస్తుందన్నారు. టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్ లోని రైతు వేదికలో గురువారం 144 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టేకులపల్లి లో ప్రజా ప్రభుత్వం రోడ్లు, బ్రిడ్జ్ లు అభివృధ్ధి చేస్తున్నామన్నారు. పేదల కోసం ఆలోచన చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఇందిరమ్మ ఇళ్ళు అర్హులందరికి ఇస్తున్నామని ఎప్రియల్ నెలలో మరలా ఇస్తామన్నారు. ప్రజా ప్రభుత్వ పనితీరుకు సర్పంచ్ ఎన్నికలు, మున్సిపాలిటి ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు.
రూ.1.45 కోట్ల విలువైన చెక్కులు లభ్ధిధారులకు మనదేశమని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల 28న జరిగే సంతు సేవాలాల్ జయంతి ముగింపు వేడుకల గోడ పత్రికలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి తహసీల్దార్ వీరభద్రం, జిల్లా కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భుక్యా దేవా నాయక్, నాయకులు ఈది గణేష్, సర్ధార్ మండలంలోని పలు గ్రామ పంచాయతీల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గోన్నారు.




