18 August, 2026 | 5:41 PM

భూస్వాముల అన్యాయానికి ఎదురునిలిచిన విప్లవ వీరుడు

18-08-2026 04:39 PM

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ - ఎమ్మెల్యే జారె 

దమ్మపేట,(విజయక్రాంతి): బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా అశ్వారావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే మాట్లాడుతూ, నాటి మొఘల్ సుల్తాన్లు, స్థానిక భూస్వాముల అణచివేతకు వ్యతిరేకంగా స్వంతంగా ఖిలాషాపూర్ రాతి కోటను నిర్మించి స్వయంపాలనను సాధించిన గొప్ప విప్లవ వీరుడు పాపన్న గౌడ్ అని కొనియాడారు.

కుల, మత వ్యత్యాసాలు లేకుండా శ్రమజీవులను ఏకం చేసి, భూస్వాముల సంపదను స్వాధీనం చేసుకుని పేదలకు పంచిపెడుతూ ఆత్మగౌరవాన్ని అందించిన ఆయన పోరాటం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజంలో సామాన్య వర్గం కూడా రాజ్యాధికారాన్ని సాధించగలదని నిరూపించిన పాపన్న గౌడ్ పోరాట పటిమను, ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని బహుజనుల, ప్రాంతీయ అభివృద్ధికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.