1 May, 2026 | 8:49 PM

ఎమ్మెల్యే మార్నింగ్ వాక్.. గుడ్ మార్నింగ్ పేరుతో పల్లెలన్నింటిని చుట్టుముట్టి సమస్యలు పరిశీలించి

01-05-2026 07:24 PM

బోథ్,(విజయక్రాంతి): బోథ్ శాసనసభ్యులు జాదవ్ అనిల్ ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ మార్నింగ్ పేరుతో పల్లెబాట పట్టారు. శుక్రవారం ప్రారంభించిన ఈ కార్యక్రమం మొదటగా బజార్హత్నూర్ మండలంలోని రాంపూర్ కొత్తపల్లి గ్రామాలను పర్యటించడం జరిగింది. ఆయా గ్రామాల్లో సమస్యలను తెలుసుకుంటూ గ్రామాలను చుట్టుముట్టారు. ఒకవైపు ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మరోవైపు గ్రామాల అవసరాలను గుర్తించి భవిష్యత్తులో చేపట్టి కార్యక్రమాలను అభివృద్ధి పనులను నోట్ చేసుకోవడం జరిగింది. అంతేగాక బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు దృష్టి సారించారు. శుక్రవారం రాంపూర్ గ్రామానికి చెందిన వారు వివిధ పార్టీల నుండి బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే సమక్షంలో చేరారు. గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యేని ఆదివాసీల సాంప్రదాయబద్ధంగా స్వాగతించి సత్కరించారు. దీంతో ఎమ్మెల్యే చేపట్టిన కార్యక్రమం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.