26 February, 2026 | 8:15 PM

ప్రజల హక్కులను ఎమ్మెల్యే పరిరక్షిస్తున్నారు

26-02-2026 12:15 AM
  1. ఇన్నేళ్ల చరిత్ర ఉన్న పెబ్బేరు సంత బిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాకే అవంతరాలు..

ప్రజలకు మేలు చేసే ప్రయోజనాలు ఉండాలి 

ఎమ్మెల్యే పై నిరాధారణమైన మాటలు మానుకోవాలి

విలేకరుల సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మాజీ వైస్ చైర్మన్ బి.కృష్ణ

వనపర్తి, ఫిబ్రవరి 25 ( విజయక్రాంతి ) : ప్రజల హక్కులను పరిరక్షిస్తున్న ఎమ్మెల్యే మేఘా రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మా ట్లాడిన మాటలు అన్నీ వెనక్కి తీసుకోవాలని, పెబ్బేరు సంత ప్రజలకు అంకితం చే సేందుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే పై నిరాధారణమైన మాటలు మానుకోవాలి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ లు డిమాండ్ చేశారు.

బుధవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిల ర్ బ్రహ్మచారీ, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, కౌన్సిలర్ శరవందలు మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల చరిత్ర ఉన్న పెబ్బేరు సంత పె బ్బేరు ప్రజలకు జీవనోపాధి గా ఆసరాగా ని లుస్తున్న సంతను బిఆర్‌ఎస్ ప్రభుత్వం వ చ్చాక సంతను కబ్జా చేసే కుట్టలు చేయడం వల్ల ఆటంకాలు ఎదురయ్యాయి అన్నారు.

వనపర్తి జిల్లా కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం ముందు ఉన్న స్థలాన్ని, పెబ్బేరు సం త స్థలాన్ని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అ నుచరుడికి కట్ట పెట్టేందుకు కుట్రలు చేసిన సంగతి ప్రజలందరికీ తెలుసునన్నారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి చేసిన భూ కబ్జా విషయాలపై ప్రజలకు తెలియచెప్పిన ఎమ్మెల్యే పై నిరాధారణమైన మాటలు మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. ఎమ్మెల్యే పై అసభ్య పదజాలం తో మాట్లాడడం ఎంతవరకు సమంజసంమన్నారు. ప్రజల కోసం అండగా ఉంటూ ప్రజల పక్షిపాతిగా పనిచేస్తున్న ఎమ్మెల్యే పై ఆరోపణలు సహించ బోమన్నారు.

మొన్న జరిగిన మున్సిపల్ ఎ న్నికల్లో బిఆర్‌ఎస్ నాయకులకు తగిన బుద్ధి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయ విలువలతో కూడిన సమాజాల్లో అన్యాయం జరుగుతున్న సంఘటనలు స్పందించి తనవంతుగా బాధ్యత వహించాలని హితువు ప లికారు. ఈ సమావేశంలో ప్రముఖ డాక్టర్ పగిడాల శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ పరశు రాం, కాంగ్రెస్ నాయకులు శివ, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు జానకి రాములు, తిరుపత య్య, పలువురు ఉన్నారు.