26 February, 2026 | 9:40 PM

ఏడాది క్రితం నిర్మాణం.. నేటికీ తాళం తీయని వైనం

26-02-2026 12:17 AM

రూ. 18 లక్షలతో నిర్మాణం.. దారిలేని ఆరోగ్య కేంద్రం 

ప్రజలకు అందని వైద్యం 

భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 25, (విజయక్రాంతి): దేవుడు వరమిచ్చిన.. పూజారి అన్న చందాన ఉంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖ అధికారుల పనితీరు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పట్టణ ఆరోగ్య కేంద్రాలను మంజూరు చేస్తోంది. లక్షల నిధులు వెచ్చించి నిర్మించిన ఆరోగ్య కేంద్రాలు అధికారుల వృధాసేన వైఖరికి అలంకారప్రా యంగా నిలుస్తున్నాయి.

అందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలో వెంగళరావు కాలనీలో నిర్మించిన పట్టణ ఆరోగ్య కేంద్రం అద్దం పడుతోంది. పట్టణ పరిధిలోని వెంగళరావు కాలనీ, ప్రశాంత కాలనీ వాసులకు మెరుగైన వైద్యం అందించాలని లక్ష్యంతో 2021లో సర్వే నెంబర్ 727/24లో 450 అడుగుల భూమిని పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని కేటాయించారు. ఆ స్థలంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు రూ 18 లక్షల నిధులను మంజూరు చేసి ఐటిడిఏ ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టి ఏడాది క్రితం పూర్తి చేశారు.

భవన నిర్మాణం పూర్తయినప్పటికీ ఆసుపత్రికి వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో భవనం అలంకార పరాయంగా నిలిచింది. ఆసుపత్రికి రోడ్డు సౌకర్యం కల్పించి వైద్య సౌకర్యం అందించాలని ఫలుమార్లు అధికారులకి విజ్ఞప్తి చేసిన చెవిటి వాడే ముందు శంఖం ఊదినట్లే అన్న చందాన ఉంది అధికారుల తీరు. వైద్య సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్న ఆ రెండు కాలనీ ప్రజల ఆశ నిరాశే అయింది. గత ఏడాది జూలై మాసంలో మున్సిపల్ నిధులతో రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు చేశామని ఐటిడిఏ  డి ఈ మధు వెల్లడించిన నేటికి అధి కార్యరూపం దాల్చలేదు. ఎప్పటికైనా సంబంధిత అధికారులు ఆరోగ్య కేంద్రానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని, ఆసుపత్రిని తెరిచి ప్రజలకు వైద్య సౌకర్యం అందించాలని ఆ రెండు కాలనీల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.