‘ఇంటిగ్రేటెడ్ స్కూల్’ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
22-08-2026 12:50 AM
మహబూబాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి): గూడూరు మండల కేంద్రంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ పరిశీలించారు. పాఠశాల నిర్మాణ పురోగతి, నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను, ఆధునిక సదుపాయాలను ఒకే చోట అందుబాటులోకి తేవాలనే గొప్ప సంకల్పంతో ఈ సమీకృత పాఠశాలల నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఈ బృహత్తర ప్రాజెక్టు పనుల్లో ఎక్కడా రాజీ పడకుండా, నిర్దేశిత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.






