22 July, 2026 | 2:28 AM

కామన్ కమ్యూనిటీ షెడ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

22-07-2026 12:00 AM

నిర్మల్ జులై 21 ( విజయ క్రాంతి): నిర్మల్ పట్టణంలో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యమని బీజేపీ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేం ద్రంలోని దివ్యనగర్ కాలనీలో రూ.5 లక్షల కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించిన కామ న్ కమ్యూనిటీ షెడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మా ట్లాడుతూ దివ్యనగర్ కాలనీలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.

ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దశలవారీగా అభివృద్ధి పనులు చేప ట్టేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ వినీష లక్ష్మి, బీజేపీ సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, కౌన్సిలర్లు గంజి రాజు, రావులవార్ విఠల్, కూన శశాంక్, శ్రీరామోజీ నరేష్, బీజేపీ నాయకులు జుట్టు దినేష్, సాదం అరవింద్, చందు, ఈశ్వర్, ఆనంద్, ప్రజోత్, జమాల్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.