9 May, 2026 | 4:30 PM

చెక్ పోస్టులను ప్రారంభించిన ఎమ్మెల్యే

09-05-2026 12:00 AM

జన్నారం, మే 8: అటవీ శాఖ ఆధ్వర్యంలో ఖానాపూర్ నియోజక వర్గం పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన నాలుగు చెక్ పోస్టులను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ శుక్ర వారం కొబ్బరికాయ కొట్టి, జెండా ఊపి వాహనాల రాకపోకలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంఎల్‌ఏ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా ఖానాపూర్ నియోజక వర్గంలోని జన్నారం మండలం ఇందన్ పల్లి, తపాల్ పూర్, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం కొత్తగూడ, నిర్మల్ జిల్లా కడెం మండలం పాండవపూర్ లలో నూతన చెక్ పోస్టులను ప్రారంభించామన్నారు.

అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా అధికారులు ఈ చెక్ పోస్టులను గతంలో ఏర్పాటు చేసినప్పటికి లోకల్ వాహనాలను మినహాయించాలనే ఉద్దేశంతో ఆ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి నియోజక వర్గంలో రోజు తిరిగే లోకల్ వాహనాలకు మినహాయింపు కలిగించామన్నారు. ఇక నుంచి లోకల్ వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు కలుగవన్నారు. అధికారులు అటవీ జంతువులు, సంపద పరిరక్షణకు కృషి చేస్తూ ప్రజలకు, వాహనదారులకు అందుబాటులో ఉంటూ రక్షణగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, స్థానికులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.