15 May, 2026 | 5:32 PM

నిర్మల్ కవికి సన్మానం

15-05-2026 04:43 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ కు చెందిన కవి రచయిత డా.బి.వెంకట్ కుటుంబం రాష్ట్ర సాహితీ సన్మానాన్ని అందుకున్నారు. పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కె.మురళీమోహన్, కుసుమ కళాపీఠం అధ్యక్షురాలు డా.రాధకుసుమ, సినీరచయిత, దర్శకులు వై శ్రీరాం చౌదరి, గౌరవం అతిథులు-డా బి.గంగాధర్ రెడ్డి, వి.వెంకట్రావు, నిర్మల ప్రభాకర్, వేణు గోపాల శర్మ, ఎల్.రామచంద్రారావు, సినీనటి విజయలక్ష్మీల చేతుల మీదుగా ఈ సన్మానం హైదరాబాదులో స్వీకరించారు. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం పురస్కరించుకొని సన్మానం సన్మానాన్ని అందుకున్న కవికి నిర్మల్కు చెందిన కవులు రచయితలు ప్రత్యేక అభినందనలు తెలిపారు.