15 May, 2026 | 6:52 PM

19వ డివిజన్ లో ఉచిత ఎక్స్రే పరీక్షలు..

15-05-2026 05:28 PM

- ప్రారంభించిన కార్పోరేటర్ సుధగోని మాధవి-కృష్ణ గౌడ్ 

ముకరంపుర,(విజయక్రాంతి): టీబి ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా వయస్సు 14 సంవత్సరములు పైబడి ఉన్న వారందరికీ మెగా ఎక్స్రే క్యాంపు కరీంనగర్ కార్పొరేషన్ 19వ డివిజన్ లో  ఏర్పాటు చేయడం జరిగింది  డివిజన్ ప్రజలందరికీ ఉచితంగా ఎక్స్రే తీసి టిబి నిర్ధారణ పరీక్షలు చేసి .టిబి ఎక్కువగా సోకే అవకాశం అనగా షుగర్ ఉన్న వారు,పొగాకు ఉత్పత్తులు వాడే వారు. మద్యం సేవించేవారు. టిబి లక్షణాలు ఉన్నవారికి ఉచిత చెస్ట్ ఎక్స్రే లు తీసి  టిబి నిర్దారణ చేయబడింది టిబి నిర్ధారణ అయితే 6 నెలల పాటు ఉచిత మందులతో పాటు పోషకాహారం కోసం 6 నెలల పాటు నెలకు రూ.1000లు  కూడా అందిస్థామన్నారు .ఈ కార్యక్రమంలో 19 వ డివిజన్ కార్పోరేటర్ సుధగోని.మాధవి-కృష్ణ గౌడ్. వైద్య అధికారి లావణ్య. వైద్యులు సతీష్ శ్రీనివాస్  తదితరులు పాల్గొన్నారు.