23 May, 2026 | 7:30 PM

Breaking News

ఖానాపూర్ బొడ్డోని కుంట సుందరీకరణకు శ్రీకారం   •   మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి   •   కొయ్యగుట్ట అమరవీరుల స్థూపానికి మరమ్మతులు చేపట్టండి   •   డబిల్ పూర్‌లో కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్ ఆరిఫ్ పర్యటన   •   తాళం వేసి ఉన్న ఇల్లులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్   •   తప్పులు మీరు చేసి నిందలు మాపై వేయడం సరికాదు   •   రామాయంపేటలో విషాదం.. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నేతల అండ   •   కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •  

డబిల్ పూర్‌లో కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్ ఆరిఫ్ పర్యటన

23-05-2026 07:02 PM

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు కొత్త పింఛన్ లు

పదవులు ఉన్న లేకపోయినా ప్రజల కోసమే నా సేవ 23వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ ఆరిఫ్

​మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): ఎల్లంపేట్ మున్సిపాలిటీ  డబిల్ పూర్ 23వ మున్సిపల్ వార్డులో  స్థానిక కౌన్సిలర్ మహమ్మద్ ఆరిఫ్ విస్తృతంగా పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ వార్డులో వాడ వాడల తిరుగుతూ స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2వ తేదీన ఎంతో ప్రతిష్టాత్మకంగా కొత్త పింఛన్ లు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కార్యక్రమాన్ని చేపట్టబోతోందని ఆయన వెల్లడించారు.

గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో కొత్త పింఛన్ లను ఇవ్వకుండ పేద ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని ఆయన విమర్శించారు.ప్రస్తుత రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల కొత్త పింఛన్ లను మంజూరు చేయుటకై చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు.మున్సిపల్ వార్డులో అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చూసేందుకు నేరుగా ఇళ్లకు వెళ్లి దరఖాస్తు పత్రాలను సేకరిస్తున్నట్లు మున్సిపల్ కౌన్సిలర్ ఎండీ అరీఫ్ పేర్కొన్నారు.

పదవులు ఉన్నా లేకపోయినా డబిల్ పూర్ గ్రామంలో నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తూ, నిరుపేదలకు ఆర్థికంగా అండగా నిలబడటమే తన లక్ష్యమని ఆరిఫ్ స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా సహాయం చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు ఆయన తెలిపారు.​ఇందులో భాగంగానే గత వారం రోజుల క్రితం పట్టణానికి చెందిన తలారి కృష్ణ కుమారుడు నర్సింగ్ మృతి చెందగా వారి కుటుంబాన్ని ఆరిఫ్ పరామర్శించారు.ఆపదలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి తన వంతు సహాయంగా 5,000 (ఐదు వేల రూపాయల) లఆర్థిక సహాయంగా అందజేశారు.​ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మహమ్మద్ ఆరిఫ్ వెంట స్థానిక నాయకులు సల్ల వెంకటేష్ యాదవ్.వినోద్. నరసింహ తదితరులు పాల్గొన్నారు.