గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
23-05-2026 07:07 PM
చేగుంట,(విజయక్రాంతి): గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మాసాపేట పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. చేగుంట మండలం ఉల్లితిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన కుకునూర్ రాజులు (48)తూప్రాన్ నుండి తన బైక్ పైన తన గ్రామానికి తిరిగి వస్తుండగా మాసాయిపేట్ బీజేపీ కార్యాలయం సమీపంలో వెనుక నుండి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న చేగుంట ఎస్సై చైతన్ కుమార్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.






