23 May, 2026 | 7:27 PM

Breaking News

ఖానాపూర్ బొడ్డోని కుంట సుందరీకరణకు శ్రీకారం   •   మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి   •   కొయ్యగుట్ట అమరవీరుల స్థూపానికి మరమ్మతులు చేపట్టండి   •   డబిల్ పూర్‌లో కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్ ఆరిఫ్ పర్యటన   •   తాళం వేసి ఉన్న ఇల్లులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్   •   తప్పులు మీరు చేసి నిందలు మాపై వేయడం సరికాదు   •   రామాయంపేటలో విషాదం.. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నేతల అండ   •   కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •  

మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా

23-05-2026 07:11 PM

- బోధన్ పట్టణంలోని 32 సీసీ కెమెరాలు ప్రారంభించిన పోలీస్ కమిషనర్

బోధన్,(విజయక్రాంతి): శనివారం మధ్యాహ్నం సమయంలో బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోధన్ పోలీస్ స్టేషన్ కార్యాలయం  యందు మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా 32 సీసీ కెమెరాలను  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య, ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్  మాట్లాడుతూ... ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడము ఎంతో సంతోషమని, ఒక్క సీసీ కెమెరా అనేది 100 మంది పోలీసులతో సమానమని, సీసీ కెమెరాల ద్వారా పట్టణంలో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను సులభంగా గుర్తించి తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని, నేరాల నివారణలో సీసీ కెమెరాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. అలాగే ట్రాఫిక్ నియంత్రణలో కూడా ఈ కెమెరాలు పోలీసులకు సహాయపడతాయని వివరించారు. ప్రజలు తమ ప్రాంతాల్లో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పోలీస్ శాఖకు సహకరించాలని కమిషనర్ సూచించారు. పోలీస్ శాఖ చేపడుతున్న కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలకు ప్రజలు ముందుకు వచ్చి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ప్రతి ఒక్క వార్డు కౌన్సిలర్ 5 చొప్పున కెమెరా లు వారి వార్డు భద్రత కోసం పెట్టాలని చెప్పారు. ఇది వారి భాద్యతగా తీసుకోవాలి. నగల దుకాణాల యజమానులు తప్పనిసరిగా సిసి కెమెరా లు పెట్టుకోవాలీ. బోధన్ టౌన్ లో 32 కెమెరాలు పెట్టి సహకరించిన  కదం ప్రమోద్ ను సీపీ గారు సన్మానించారు. ఈ సందర్భంగా బోధన్ పట్టణంలో డ్రగ్స్ నివారణ ,  సైబర్ క్రైమ్ పట్ల అవగాహన,  రోడ్డు ప్రమాదాలను నివారణ కోసం వాల్ పెయింట్స్ వేస్తూ ప్రజలలో అవగాహన కల్పిస్తున్నటువంటి సమీర్ ను అభినందించడం జరిగింది.