23 May, 2026 | 7:34 PM

Breaking News

ఖానాపూర్ బొడ్డోని కుంట సుందరీకరణకు శ్రీకారం   •   మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి   •   కొయ్యగుట్ట అమరవీరుల స్థూపానికి మరమ్మతులు చేపట్టండి   •   డబిల్ పూర్‌లో కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్ ఆరిఫ్ పర్యటన   •   తాళం వేసి ఉన్న ఇల్లులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్   •   తప్పులు మీరు చేసి నిందలు మాపై వేయడం సరికాదు   •   రామాయంపేటలో విషాదం.. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నేతల అండ   •   కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •  

రామాయంపేటలో విషాదం.. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నేతల అండ

23-05-2026 06:54 PM

రామాయంపేట,(విజయక్రాంతి): రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డుకు చెందిన మద్దూరి వీరయ్య  అనారోగ్యంతో మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు వెంటనే వారి నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. భవిష్యత్తులో కూడా కుటుంబానికి అండదండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ గాజవాడ లావణ్య నాగరాజు  మాట్లాడుతూ, “వీరయ్య  మరణం బాధాకరం. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలి.

కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 7వ వార్డు కౌన్సిలర్ గజవాడ నాగరాజు, 6వ వార్డు కౌన్సిలర్ పుట్టి సందీప్, 3వ వార్డు కౌన్సిలర్ గుగులోత్ రవి, 9వ వార్డు కౌన్సిలర్ దేవుని రంజిత్, డీసీసీ జిల్లా ఉపాధ్యక్షులు చింతల యాదగిరి కార్యదర్శి పోచమ్మల గణేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దాకి స్వామి పాల్గొన్నారు. అలాగే యూత్ నాయకులు మోబిన్, పోచమ్మల భాను, చిలుక విరాట్, సుధీర్ గౌడ్, అక్కల నరేందర్, సోహెల్, దేవుని నరేష్‌తో పాటు 6వ వార్డు రజక సంఘం నాయకులు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై మద్దూరి వీరయ్యకి నివాళులర్పించారు.