కళాకారుడి శవపేటిక మోసిన ఎమ్మెల్యే
03-04-2026 12:08 AM
యాదగిరిగుట్ట, ఏప్రిల్ 2: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రానికి చెందిన రాష్ట్ర గాయకుడు, కళాకారుడు యండి జహంగీర్ గురువారం గుండె పోటు తో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అంత్యక్రియల్లో పాల్గొని ఆయన శవపేటిక (జానాజా డోలిని) మోసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ జహంగీర్ కళాకారుడు గా ప్రజలని చైతన్యం చేస్తూ ఉద్యమ స్ఫూర్తిని నింపాడన్నారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. మాజీ ప్రభుత్వం గొంగిడి సునీత మహేందర్ రెడ్డి జహంగీర్ మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. వీరి వెంట పలువురు ఉన్నారు.




