సత్తుపల్లిలో కూటమి రాష్ట్ర కార్యాలయం ప్రారంభం
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని డా. మద్దిశెట్టి సామేలు వెల్లడి
తెలంగాణలో భద్రాద్రిలో ఎంపీగా , సత్తుపల్లిలో ఎమ్మెల్యేగా గెలుపు ధీమా వ్యక్తం
సత్తుపల్లి,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా, సత్తుపల్లిలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) – ఎన్‌డీఏ కూటమి (ఎన్‌వైసీ) తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని నేడు మధ్యాహ్నం 12:20 గంటలకు ఘనంగా ప్రారంభించారు. పార్టీ రాష్ట్ర గౌరవ సలహాదారు రాజులపాటి ఐలయ్య, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు, సీనియర్ ఆదివాసీ నాయకులు పొణక రామదాసు సంయుక్తంగా కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జాతీయ కార్యవర్గ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ & ఒడిశా రాష్ట్రాల ఇన్‌చార్జ్, ఎన్‌సీపీ–ఎన్‌డీఏ కూటమి (ఎన్‌వైసీ) నాయకులు డా. మద్దిశెట్టి సామేలు మాట్లాడుతూ, తెలంగాణలో పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మరింత బలోపేతం చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రస్తుతం పార్టీకి 2 లక్షల 50 వేల మంది సభ్యత్వం ఉన్నట్లు పేర్కొన్నారు. యువత, మహిళలు, రైతులు, వెనుకబడిన వర్గాలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ కార్యాలయం లేకపోవడంతో సత్తుపల్లిలో రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎంపీగా పోటీ చేస్తానని, సత్తుపల్లి నియోజకవర్గం జనరల్‌గా ఉంటే ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తానని గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి వరంగల్, మహబూబాబాద్, జనగామ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ ఇన్‌చార్జ్‌లు, రాష్ట్ర కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
పాల్గొన్న ముఖ్య నాయకులు:
ఎన్‌వైసీ జాతీయ అధ్యక్షులు ధీరజ్ శర్మ, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి & ఎన్‌సీపీ జాతీయ అధ్యక్షురాలు సునేత్రా పవార్, పలగాని శ్రీనివాస్ గౌడ్ (రాష్ట్ర ప్రధాన కార్యదర్శి), ఊకె ఎంకన్న (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు), కిన్నెర రామకృష్ణ (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు), సురేష్ సీతారాములు (ఇల్లందు అసెంబ్లీ ఇన్‌చార్జ్), కారం చంద్రయ్య (పినపాక అసెంబ్లీ ఇన్‌చార్జ్), కారం రాజు (బూర్గంపాడు మండల అధ్యక్షులు), పుట్టబంతి హరిబాబు (ఖమ్మం జిల్లా అధ్యక్షులు), ఈదుల రవి (ఖమ్మం జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు), బిర్రు సామేలు (జనగామ జిల్లా ఇన్‌చార్జ్), గరిడేపల్లి రవి (వైరా), సయ్యద్ ఖమ్రుద్దీన్ ఖాద్రి (అన్నపురెడ్డిపల్లి మండలం), పెద్దగౌండ్ల పుల్లారావు (అన్నపురెడ్డిపల్లి), కొరసా కళావతి (దమ్మపేట మండలం) తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం పార్టీ విస్తరణకు కొత్త ఊపునిస్తుందని నాయకులు అభిప్రాయపడ్డారు.






