6 April, 2026 | 5:39 PM

బిజెపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన మిట్టపల్లి ప్రవీణ్ కుమార్

06-04-2026 03:36 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని పూసాల రోడ్డులో గల బిజెపి ఆఫీస్ ముందు బిజెపి నాయకులు మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ జెండా ఆవిష్కరించినంతరం స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా  మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ 1980 ఏప్రిల్ ఆరవ తేదీన ఆవిర్భవించిన బిజెపి పార్టీ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా రూపొందినన్నారు. భారతదేశ అభివృద్ధిలో బిజెపి పార్టీ కీలక పాత్ర పోషిస్తుంది అన్నారు రాబోవు కాలంలో పెద్దపెల్లి జిల్లాలో అన్ని శాసనసభ స్థానాలు బిజెపి కైవసం చేసుకుంటుందని అన్నారు ఆదిశగా బిజెపి నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారని అన్నారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా,మండల, మున్సిపాలిటీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు,