19 August, 2026 | 1:25 AM

రేపు పెద్దపల్లి జిల్లాలో మంత్రుల పర్యటన

19-08-2026 12:08 AM

పెద్దపల్లి, ఆగస్టు 18 (విజయక్రాంతి): రాష్ట్ర ఆర్‌అండ్బీ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు బుధవారం పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని, రామగుండం ప్రాంతాల్లో పలు ఆర్‌అండ్బీ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడంతో పాటు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.

పర్యటన వివరాలు

మంత్రులు ఉదయం 11.30 గంటలకు పెద్దపల్లి ఐడీఓసీకి చేరుకుంటారు. అనంతరం 11.45 నుంచి మధ్యాహ్నం 12 గంటల వర కు గర్రెపల్లి వద్ద ఆర్‌అండ్బీ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12.10 నుంచి 1.45 గంటల వరకు సుల్తానాబాద్లో ఆర్‌అండ్బీ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యా హ్నం 2 నుంచి 2.30 గంటల వరకు శివపల్లిలో ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు నివాసంలో మంత్రులు భోజనం చేస్తారు.

మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆర్‌అం డ్బీ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, అనంతరం జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 నుంచి 5.45 గంటల వరకు రామగుండంలో ఆర్‌అండ్బీ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాప న చేస్తారు.మంత్రుల పర్యటనకు సంబంధించిన కార్యక్రమాలను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కవర్ చేయాలని జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారులు కోరారు.