calender_icon.png 12 February, 2026 | 12:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాదేవప్ప మృతికి నాకు సంబంధం లేదు

12-02-2026 11:34:32 AM

మక్తల్ బీజేపీ అభ్యర్థి మృతిపై మంత్రి స్పందన

నేను మహాదేవప్పకు కాల్ చేయలే

హైదరాబాద్: మక్తల్ బీజేపీ అభ్యర్థి మృతిపై మంత్రి వాకిటి శ్రీహరి(Minister Vakiti Srihari) స్పందించారు. మహాదేవప్ప మృతికి తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి వెల్లడించారు. తనపై ఆరోపణలు రుజువైతే దేనికైనా సిద్ధమన్నారు. తాను మహాదేవప్పకు కాల్ చేయలేదని మంత్రి వివరించారు. కావాలంటే తన కాల్ డేటా చెక్ చేసుకోవచ్చని తెలిపారు. పోస్ట్ మార్టం రిపోర్టు తర్వాత కారణాలు తెలుస్తాయని స్పష్టం చేశారు. చట్టం తనపని తాను చేసుకుపోతుందని చెప్పారు. రాజకీయ లబ్ధికోసం ప్రతిపక్షాల దిగజారుడు సరికాదని హెచ్చరించారు.