17-02-2026 01:14:02 PM
హైదరాబాద్: హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరుగుతున్న 23వ ఎడిషన్ బయో ఆసియా 2026(BioAsia 2026) సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) పాల్గొన్నారు. బయో సదస్సు లక్ష్యాలు, ప్రభుత్వ విజన్ ను శ్రీధర్ బాబు వివరించారు. ఔషధాలు అందుబాటు ధరల్లో ఉండే విధంగా హెల్త్ కేర్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఏఐతో సాంకేతిక విప్లవం రాబోతోందని శ్రీధర్ బాబు వెల్లడించారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ లో లైఫ్ సైన్సెస్ పాలసీని విడుదల చేశామని చెప్పారు. 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేశామని పేర్కొన్నారు. 5 లక్షల మంది ఉపాధి పొందేలా లైఫ్ సైన్సెస్ పాలసీ రూపకల్పన చేశామన్నారు. దేశంలో తొలిసారిగా లైఫ్ సైన్సెస్ వర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.