26 August, 2026 | 2:34 PM

హైటెక్ సిటీలో 'ఆక్టేవ్ జీసీసీ'ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

26-08-2026 12:25 PM

మారుమూల గ్రామాలకూ ఫైబర్ కేబుల్ ఇంటర్నెట్

జీసీసీల వల్ల ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి

30 ఏళ్ల క్రితమే కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీకి శ్రీకారం 

హైదరాబాద్: ఐటీ రంగానికి ప్రజాప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) పేర్కొన్నారు. హైటెక్ సిటీలో అక్టేవ్ జీసీసీని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు బుధవారంనాడు ప్రారంభించారు. దేశంలో అత్యధిక జీసీసీలు హైదరాబాద్ లో ఏర్పాటవుతున్నాయని శ్రీధర్ బాబు సూచించారు.

ఏడాది వ్యవధిలో 75 జీసీసీలు నగరంలో ఏర్పాటయ్యాయని వెల్లడించారు. ఫార్చ్యూన్ -500(Fortune 500) లోని కంపెనీలు హైదరాబాద్ లో జీసీసీలు పెడుతున్నాయని వివరించారు. ఎంతో నైపుణ్యమున్న యువత నగరంలో అందుబాటులో ఉందని మంత్రి స్పష్టం చేశారు. జీసీసీల వల్ల లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తోందని పేర్కొన్నారు. 30 ఏళ్ల క్రితమే కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీకి శ్రీకారం చుట్టుందని వ్యాఖ్యానించారు. మారుమూల గ్రామాలకూ ఫైబర్ కేబుల్ తో ఇంటర్నెట్ ఇస్తున్నామని మంత్రి తెలిపారు.