12 July, 2026 | 4:14 PM

Breaking News

షాబాద్ సైకో కిల్లర్ కోసం పోలీసుల వేట   •   విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు   •   సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •  

కేరళలో ప్రచారానికి మంత్రి శ్రీధర్‌బాబు

24-03-2026 01:39 AM

ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ ఎంపిక 

హైదరాబాద్, మార్చి 23 (విజయక్రాంతి): కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి  తెలంగాణ నుంచి నలుగురు నేతలను ఏఐసీసీ ఎంపిక చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వారిలో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, శాసన మండలి విప్ బల్మూరి వెంకట్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలను ఏఐసీసీ కేరళ ఎన్నికల ప్రచారానికి నియమించింది.

మంత్రి శ్రీధర్ బాబుని రెండు జిల్లాల ఇంచార్జ్‌గా నియమించగా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ త్రివేండ్రంలోని కేరళ పీసీసీ కార్యాలయంలో వీరితో సమావేశం అయ్యారు. ఏప్రిల్ 7వ తేదీ వరకు వారికి కేటాయించిన ప్రాంతాల్లో వీరు ఎన్నికల కార్యక్రమాలు చేయాల్సి ఉంటుందని అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.