1 June, 2026 | 6:16 PM

ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం

01-06-2026 04:54 PM

ధన్వాడలో ఇందిరమ్మ ఇళ్ల గృహల  ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు

మంథని,(విజయక్రాంతి): ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంథని నియోజకవర్గం, భూపాలపల్లి జిల్లా, కాటారం మండలం, ధన్వాడ గ్రామంలో నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహ ప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇళ్ల వద్ద రిబ్బన్ కట్ చేసిన మంత్రి శ్రీధర్ బాబు నూతన గృహాల్లోకి అడుగుపెట్టిన కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. కొత్త ఇళ్లలోకి అడుగుపెడుతున్న కుటుంబాలన్నీ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మంత్రి మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.