1 June, 2026 | 7:05 PM

మంథని కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వేముల లక్ష్మీ ప్రసాద్ బాధ్యతల స్వీకరణ

01-06-2026 05:45 PM

మంథని,(విజయక్రాంతి): మంథని అడిషనల్ సెషన్స్ కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP)గా వేముల లక్ష్మీ ప్రసాద్ సోమవారం అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన మంథని కోర్టుకు బదిలీపై వచ్చారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వేముల లక్ష్మీ ప్రసాద్ న్యాయవ్యవస్థలో సుదీర్ఘమైన అనుభవం ఉంది.  రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట చెందిన లక్ష్మీ ప్రసాద్ 1996లో న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించారు.

 1998లో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) గా ఎంపికయ్యారు. గతంలో సిరిసిల్ల జిల్లా అదనపు సెషన్స్ కోర్టుతో పాటు, ఏసీబీ కోర్టులో కూడా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సమర్థవంతంగా సేవలు అందించారు. సాధారణ బదిలీల ప్రక్రియలో భాగంగా మంథనికి వచ్చిన లక్ష్మీ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా, స్థానిక న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.