7 August, 2026 | 5:04 PM

Breaking News

చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి   •   సౌత్ ఇండియా కరాటేలో స్టెమ్‌స్పార్క్ విజయం   •   సిద్దిపేట టిఐసిసిఐ కో-ఆర్డినేటర్‌గా బిక్షపతి   •   గణపురం జడ్పీహెచ్‌ఎస్‌లో ముందస్తు బోనాల సంబరాలు   •   క్విట్ ఇండియా స్ఫూర్తితో జైలు భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి   •   వానాకాలం పంటలకు పోచారం ప్రాజెక్టు నీటి విడుదల   •   అచ్చంపేటలో ప్రజాస్వామ్య హక్కులు దెబ్బతింటున్నాయి   •   విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్   •   బీజేపీ కిసాన్ మోర్చా నూతన మండల అధ్యక్షులకు నియామక పత్రాల అందజేత   •   అన్నపూర్ణ పంప్ హౌస్ లు ఆన్ చేయాలి: సిద్ధం వేణు   •  

తాండూరులో విషాదం.. భవనం పైనుంచి పడి చిన్నారి మృతి

05-08-2026 12:36 PM

తాండూరు: వికారాబాద్ జిల్లా(Vikarabad) తాండూరులోని గాంధీనగర్‌లో తీవ్ర విషాదం చోటుచేసకుంది. భవనం రెండో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి 18 నెలల చిన్నారి మృతి చెందింది. అందిన సమాచారం ప్రకారం, ఆ చిన్నారిని దీక్షితగా గుర్తించారు. ఆమె ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.