30 June, 2026 | 11:31 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

పలుగుట్ట తొల్కట్ట బీటీ రోడ్డుకు మంత్రి సీతక్క హామీ

16-04-2026 12:00 AM

 టీపీసీసీ ఉపాధ్యక్షులు జనార్దన్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు బి. శ్రీనివాస్ గౌడ్.

చేవెళ్ళ ఏప్రిల్ 15(విజయక్రాంతి): పలుగుట్ట - తోలుకట్ట వరకు బిటి రోడ్డు నిర్మాణం కోసం రూ.5.5 కోట్లు మంజూరు చేయాలని మంత్రి సీతక్కను టీపీసీసీ ఉపాధ్యక్షులు జనార్దన్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు బి. శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఇందుకు గాను మంత్రి సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

మంత్రి సీతక్క బీటీ రోడ్డుకు నిదులిచ్చేందుకు హామీ ఇవ్వడం పట్ల టీపీసీసీ ఉపాధ్యక్షులు జనార్దన్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు బి. శ్రీనివాస్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. బీటీ నిర్మాణం జరిగితే ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాండు యాదవ్,మల్గారి వాసుదేవ్ రెడ్డి, మాజీ సర్పంచ్ నడిపెల్లి నరసింహ, మాజీ సర్పంచ్ నారాయణ గౌడ్ , పీసరి గోపాల్ రెడ్డి, మల్ గారి  రవీందర్ రెడ్డి, సంగం మల్లారెడ్డి, మల్గారి కృష్ణారెడ్డి, పులగుర్ల హేమంత్ రెడ్డి, గుర్రాల జంగారెడ్డి, బుల్కాపురం మల్లారెడ్డి, పోలీస్ శివకుమార్ రెడ్డి, పోలీస్ సుధాకర్ రెడ్డి, మల్గారి దామోదర్ రెడ్డి, మాల్గారి  శ్రీనివాస్ రెడ్డి, గౌండ్ల మల్లయ్య గౌడ్, రాల్లగూడెం పోచిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.