26 June, 2026 | 7:02 PM

Say No to Drugs: ఒక్కసారి డ్రగ్స్ బారిన పడితే... జీవితం నిర్వీర్యం

26-06-2026 05:55 PM
  1. యువత డ్రగ్స్ బారిన పడొద్దు
  2. డ్రగ్స్ నివారణకు ఈగల్ ఫోర్స్
  3. డ్రగ్స్ రహిత తెలంగాణ మా లక్ష్యం

హైదరాబాద్: అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సం(International Day Against Drug Abuse and Illicit Trafficking) సందర్భంగా శిల్పకళా వేదికలో ఈగల్ ఫోర్స్ యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy Chief Minister Bhatti Vikramarka), మంత్రి పొన్నం ప్రభాకర్, సినీనటులు రామ్ పోతినేని(Ram Pothineni ), మీనాక్షి చౌదరి హాజరయ్యారు. డ్రగ్స్ నివారణకు ప్రత్యేకంగా ఈగల్ పూర్స్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar ) తెలిపారు.

ఎంతో భవిష్యత్ ఉన్న యువత.. డ్రగ్స్ బారిన పడొద్దనేది తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. ఎక్కడైనా డ్రగ్స్ విక్రయం, సరఫరా గురించే తెలిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని మంత్రి పొన్నం పిలుపునిచ్చారు. సినిమా నటులు తమ బాధ్యతగా 'సే నో టూ' డ్రగ్స్ వీడియోలు చేసి.. అభిమానులకు సందేశం ఇవ్వాలని కోరారు.  'సే నో టూ డ్రగ్స్'(| Say No to Drugs) ప్రతిజ్ఞ చేసిన అందరం దానికి కట్టుబడి ఉండాలని తెలిపారు. ఒక్కసారి డ్రగ్స్ బారిన పడితే వారి జీవితం పూర్తిగా నిర్వీర్యం అవుతుందని మంత్రి పొన్నం హెచ్చరించారు.