ఎల్లమ్మ ఆలయానికి రూ.50 వేల విరాళం...
26-06-2026 06:47 PM
ప్రతిష్ఠ మహోత్సవాల్లో పాల్గొన్న వ్యాపారవేత్త వంగ రాజేశ్వర్ రెడ్డి
సిద్దిపేట రూరల్: సిద్దిపేట రూరల్ మండలంలోని సీతారాంపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ ప్రతిష్ఠ మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త వంగ రాజేశ్వర్ రెడ్డి మహోత్సవాలకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ అభివృద్ధి కోసం తన వంతు సహాయంగా రూ.50 వేల ఆర్థిక విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. రాజేశ్వర్ రెడ్డికి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు.






