జగ్గారం పంచాయతీ పాలవాగు చెరువు ప్రక్షాళనకు ఎమ్మెల్యేకు వినతిపత్రం
26-06-2026 06:02 PM
దమ్మపేట,(విజయక్రాంతి): జగ్గారం పంచాయతీ పరిధిలోని పాలవాగు చెరువు (ప్రాజెక్టు) ఆక్రమణలు, తూము మరమ్మతుల సమస్యల పరిష్కారం కోసం గ్రామస్తులు అశ్వారావుపేట నియోజక వర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణను కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామంలోని పాలవాగు చెరువు గత కొన్ని సంవత్సరాలుగా పూడిక, ఆక్రమణలు, తూము దెబ్బతినడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు ఎంఎల్ఏ కు తెలిపారు. చెరువును పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి, ఆక్రమణలను తొలగించి, వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వెంటనే చర్యలు తీసుకొని చెరువును అభివృద్ధి చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.






