26 June, 2026 | 7:43 PM

డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ

26-06-2026 06:17 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో మసీదు నుండి వడ్డెర కాలనీ వరకు డబుల్ లైన్ రోడ్డు నిర్మాణ పనులను వార్డు కౌన్సిలర్ ప్రభాకర్, మున్సిపల్ కమిషనర్ రమేష్ తో కలిసి  మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఛైర్మెన్ బిరుదు రాధకృష్ణ మాట్లాడుతూ సుల్తానాబాద్ మున్సిపల్ అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు సహకారంతో పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. తెలంగాణ చౌరస్తా నుండి వడ్డర కాలనీ వరకు రెండు కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టిన డబుల్ లైన్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ పనులు సగం వరకు పూర్తి అయ్యాయని మిగతా వాటిని శుక్రవారంప్రారంభించూ కోవడం జరిగిందని తెలిపారు..  ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్ రావు, మున్సిపల్ కౌన్సిలర్లు ప్రదీప్, ప్రభాకర్ , గాజుల రాజమల్లు , నాయకులు గరిగె శ్రీనివాస్ , అబ్బయ్య గౌడ్, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు...