బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాపాక ప్రవీణ్ నియామకం
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
ముకరంపుర,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ కరీంనగర్ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాపాక ప్రవీణ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అధికారిక నియామక ఉత్తర్వులను జారీ చేశారు. రాపాక ప్రవీణ్ గతంలో మానకొండూర్ మండల అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం మానకొండూరు మండలం లక్ష్మీపూర్ ఉప సర్పంచ్ గా, సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డ్ అడ్వైజరీ ప్యానెల్ మెంబర్ హోదాలో కొనసాగుతున్నారు.
ఎస్సీ వర్గాల సమస్యలకోసం, జిల్లాలో ఎస్సీ మోర్చా విభాగం మరింత బలోపేతం చేయడానికి, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తానని రాపాక ప్రవీణ్ ఈ సందర్భంగా తెలిపారు. , పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, జిల్లాలో ఎస్సీ మోర్చాను అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తానని, . తన నియామనకానికి సహకరించిన కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, బీజేపీ నాయకులకు అందరికీ ధన్య వాదాలు తెలియజేశారు.






