26 June, 2026 | 8:04 PM

ఉరి వేసుకుని వార్డు మెంబర్ ఆత్మహత్య

26-06-2026 06:50 PM

అప్పుల బాధే కారణం అన్న గ్రామస్తులు

చందుర్తి,(విజయక్రాంతి): చందుర్తి మండలంలోని ఎన్గల్ గ్రామానికి చెందిన నాల్గవ వార్డు సభ్యుడు మెరుపుల రవి గౌడ్ వయస్సు 40 సంవత్సరాలు  ఆర్థిక ఇబ్బందులతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడాడు. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం. రవి ఉపాధి నిమిత్తం అప్పు చేసి సౌదీ వెళ్లిడు. గల్ఫ్ లో సరైన పని లభించకపోవడంతో తిరిగి స్వదేశానికి వచ్చి గీతా కార్మికుడిగా వృత్తిని కొనసాగిస్తున్నాడు.

తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపం చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉదయం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు, ఆరు నెలల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నాలుగో వార్డ్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. మృతునికి భార్య మంజుల, ఇద్దరు కుమారులు ఉన్నారు. రవి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.